కిషోరీ వికాసంపై సిడిపిఓ లు పూర్తి అవగాహన కల్గి ఉండాలి : కలెక్టరు జె.నివాస్

శ్రీకాకుళం : నవంబరు 15 : వై.ఎస్.ఆర్. కిషోరీ వికాశం  ప్రొగ్రామ్ పైన సి.డి.పి.ఓలు పూర్తి ఆవగహణ కలిగి ఉండాలని  జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  ఐ.సి.డి.ఎస్ అధికారులు, సిబ్బింది సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతీ సి.డి.పి.ఓ పరిధిలో పిల్లల డేటా సంపూర్తిగా ఉండాలని ఆదేశించారు. వయసుకు తగ్గా బరువు, ఎత్తు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలని చెప్పారు. బరువు తక్కువ ఉన్నవారు ఎంతమంది పూర్తి డేటాను సిద్దంగా ఉంచాలని చెప్పారు. సి.డి. పి.ఓలు బాధ్యతా యుతంగా పనిచేయాలని అన్నారు. సి.డి. పి.ఓలు సమావేశాలు వచ్చినప్పుడు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ జి. జయదేవి మాట్లాడుతూ సి.డి.పి.ఓలు పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ముందు తెలుసుకోని వారికి శిక్షణ ఇవ్వడానికి ఎంతమంది పి.జి.టీలు ఉండాలో నిర్ణయించుకోని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ ను కలసి పి.జి.టీలను ఎంపిక చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో ఐ.సి.పి.ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.వి. రమణ, సి.డి.పి.ఓలు, సూపరవైజర్లు తదితరులు పాల్గొన్నారు.