శ్రీకాకుళం : నవంబర్ 14 : జిల్లాలో ఇసుక ధరలను నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. నియోజక వర్గాల వారీ ఒక ట్రాక్టరుకు ధరను నిర్ణయిస్తూ విడుదల చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలో ట్రాక్టరు ( 4.5 టన్నులు ) ధర 2500 రూపాయలు , శ్రీకాకుళం 2400 రూపాయలు ఎచ్చెర్ల 2700 రూపాయిలు, ఆమదాలవలస 2400 రూపాయలు రాజాం 2500 రూపాయలు , పాలకొండ 2500 రూపాయలు , పాతపట్నం 2600 రూపాయలు , టెక్కలి 3500 రూపాయలు, పలాస 4100 రూపాయలు , ఇచ్చాపురం 2400 రూపాయలుగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇసుకకు విలువ నిర్ణయం : కలెక్టరు