శ్రీకాకుళం : నవంబరు 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అగ్రీ గోల్డు బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం గురు వారం జిల్లాలో చేపడుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులకు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆనందమయి కళ్యాణమండపంలో పంపిణీకి సన్నద్ధం చేస్తున్నారు. అగ్రీ గోల్డు బాధితుల ఖాతాలలో నగదు జమ అంశాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం జిల్లా ఖజానా కార్యాలయంలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
రేపే అగ్రిగోల్డు బాధితుల చెక్కుల పంపిణీ