హైదరాబాద్ : నవంబరు 18 : దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. తన నివాసంలో దీక్ష చేపట్టిన అశ్వత్థామను నిన్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రిలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఈ ఉదయం కోదండరామ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.ఇలాగే దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అశ్వత్థామరెడ్డికి బీపీ, షుగర్ ఉండడం వల్ల కీటోన్స్ ఉత్పత్తి అవుతాయనీ అవి మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారు. అయితే ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు స్పష్టం చేశారు.రేపటి సడక్ బంద్ యథావిధిగా కొనసాగుతుంది.ఎక్కడివాళ్లు అక్కడ సడక్ బంద్‌లో పాల్గొంటారు.ఆందోళనలకు ప్రభుత్వం కుప్పకూలితే ఆ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే' అని కోదండరామ్ అన్నారు.
బలవంతంగా సెలైన్లు ఎక్కిస్తున్నారు : కోదండరామ్