శ్రీకాకుళం : నవంబరు 17 : బి.సి.ల సర్వతోముఖాభివృధ్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం స్ధానిక 80 అడుగులు రోడ్డు వద్ద ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య, నియంత్రణ మరియు పర్యవేక్షణ మరియు ఆల్ ఇండియా బి.సి. ఫెడరేషన్ చైర్మన్ జస్టస్ ఈశ్వరయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రహదారులు, భవనాల శాఖామాత్యులు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బి.సి.లకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. అయిదుగురు ఉప ముఖ్యమంత్రులుగా బహుజనలకు కేటాయించారన్నారు. ఎస్.సి, ఎస్.టి, మైనారిటీలకు నామినేటెడ్ పదవులలో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీబాయి ఫూలే, డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ల ఆశయాలకు ముఖ్యమంత్రి రూపకల్పన చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలందరూ చుదువుకునే విధంగా అనేక మార్పులు చేసారని, వున్నత విద్యకు, ప్రైమరీ విద్యకు సంబంధించిన జ్యుడీషియరీ కమీషనర్లుగా జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ కాంతారావు వంటి బహుజనవర్గాల వారిని నియమించారని తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, కులమతాలు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. కుల మతాలకతీతంగా అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నారని, అన్ని రంగాలలోను బి.సి.లకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వై.ఎస్.జగన్మోన్ రెడ్డి అభినవ అంబేద్కర్ గా అభివర్ణించారు. బి.సి.లు అనగా, వెనుక బడిన కులాలు కాదని బ్రెయిన్ కెపాసిటీ ఆఫ్ సొసైటీ అని తెలిపారు. బి.సి. ఫెడరేషన్ బి.సి.లకు న్యాయం చేస్తుందన్నారు.కార్యక్రమంలో జస్టిస్ వి.ఈశ్వరయ్యకు లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డును అందించి ఘనంగా సన్మానించారు.ముందుగా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దుంపల రామారావు, ఎ.పి.రియల్ ఎస్టేట్ ట్రిబ్యునల్ జస్టిస్ రాజా ఇలాంగో, జస్టిస్ రెడ్డి కాంతారావు, ఎ.పి.బి.సి. కమీషన్ చైర్మన్ అంబటి శంకరనారాయణ, కర్నూలు ఎం.పి. డా.ఎస్.సంజీవ్ కుమార్, డా.కూటికుప్పల సూర్యారావు, ఆల్ మన్ రాజు, గొలగాన కిశోర్ కుమార్, సచిన్ రాజ్కర్, విజయభాస్కర్, పైల రాంబాబు, చిన్నాల కూర్మినాయుడు, పప్పల జగన్నాధరావు, వి.జగన్నాధం నాయుడు,
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి