శ్రీకాకుళం : నవంబరు 20 : ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గురువారం వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డా.వి.వి.కృష్ణమూర్తి బుధ వారం తెలిపారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టుటకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.వేట నిషేద భృతి, డీజిల్ ఆయిల్ రాయితీ తదితర ఆర్ధిక సహాయక కార్యక్రమాలను కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ముఖ్య అతిధిగా హాజరు అవుతారని ఆయన చెప్పారు. జిల్లాలో 13,258 మంది మత్స్యకారులు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహాకాల ద్వారా లబ్దిపొందుతున్నారని ఆయన అన్నారు. వేట నిషేధ భృతి క్రింద రూ.10 వేలను అందించడం జరుగుతుందని అన్నారు. మత్స్యశాఖ రిజిస్ట్రేషన్, లైసెన్స్ కలిగిన సంప్రదాయ పడవలు, మర పడవలకు వర్తిస్తుందని చెప్పారు. సంప్రదాయ తెప్పకు ముగ్గురు, మర పడవలకు ఆరుగురు మత్స్యకారులకు అర్హత కలదని తెలిపారు. పడవలకు డీజిల్ ఆయిల్ సబ్సిడీని లీటరుకు 9 రూపాయలు చొప్పున నెలకు 300 లీటర్ల వరకు కల్పించడం జరుగుతుందని అన్నారు. స్మార్ట్ కార్డు ద్వారా డీజిల్ రాయితీ అందిస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణించిన మత్స్యకార కుటుంబానికి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కోస్టల్ అక్వా కల్చర్ ఆధారటి, చెన్నై వారి రిజిస్ట్రేషన్ దృవపత్రము కలిగిన అక్వా రైతులకు విధ్యుత్ చార్జీలులో రాయతి కల్పించడం జరుగుతుందని అన్నారు. యూనిట్ ను కేవలం ఒక రూపాయి ఏభై పైసలకు అందజేయడం జరుగుతుందని చెప్పారు.
రేపు వజ్రపుకొత్తూరులో మత్స్యకార దినోత్సవం