శ్రీకాకుళం : నవంబరు 10 : సముద్రంలోకి స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం తీరంలో చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరి మృత దేహం లభ్యం అయింది. మిగతా ముగ్గురు యువకుల కోసం స్థానికులు గాలిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కళింగపట్నం బీచ్ లో నలుగురు యువకులు గల్లంతు