జిల్లా అధికారుల సంఘం అధ్యక్షునిగా కళ్యాణ్ చక్రవర్తి

శ్రీకాకుళం : నవంబరు 4 : జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులుగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారుల సంఘం సమావేశం సోమ వారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధలో జరిగాయి. ఈ సమావేశంలో జిల్లా అధికారుల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి.ఆర్.డి.ఏ పిడి కళ్యాణ చక్రవర్తిని ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డా.వి.వి.కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శిగా ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి సి.హెచ్.మహాలక్ష్మి, ట్రెజరర్ గా బి.సి కార్పొరేషన్ ఇ.డి జి.రాజారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధిని జిల్లా అధికారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దయానిధి, అధ్యక్షులు కళ్యాణ చక్రవర్తి ఇతర అధికారులు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో అధికారుల సంఘం పాత్ర కీలకంగా ఉండాలన్నారు. సంఘం ఏర్పడటం వలన బలం చేకూరుతుందని అన్నారు. వృత్తిలో సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఒకరితో ఒకరు చర్చించుకునే అవకాశం వాటి పరిష్కార మార్గం దొరుకుందని పేర్కొన్నారు. పని రీత్యా ఎంతో ఒత్తిడికి గురి కావడం జరుగుతుందని సంఘంగా ఉండటం వలన పలు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మూలంగా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్ధ పిడి హెచ్.కూర్మారావు, మత్స్యశాఖ జెడి డా.వి.వి.కృష్ణమూర్తి, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఇ టి.శ్రీనివాస రావు, వంశధార ఎస్.ఇ పి.రంగారావు, సి.పి.ఓ ఎం.మోహన రావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, గురుకులం సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, హేండ్ లూమ్స్ ఏడి పద్మ, దివ్యాంగుల శాఖ ఏడి జీవన్ బాబు, సెరీకల్చర్ ఏడి త్రినాథ్, నేడ్ కాప్ డి.ఎం రాజు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలుకలు ఆర్.వి.వి.ప్రసాద్, వరప్రసాద రావు, జిల్లా సహకార అధికారి కె.వి.రావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఏపిఎంఐపి పిడి జమదగ్ని, మార్కెటింగు ఏడి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.