డయల్ యువర్ కలెక్టరుకు వినతులు వెల్లువ

శ్రీకాకుళం, నవంబర్ 18:  డయల్ యువర్ కలెక్టర్ కు 9 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారి దయానిధి,
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ. కల్యాణ్ చక్రవర్తి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోన్  చేస్తూ తమ సమస్యలను విన్నవించారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1.జలుమూరు మండలం చల్లవానిపేట నుండి v. ఢిల్లీరాజ్ ఫోన్ చేసి ఈ నెల 21న పంచాయతీలో జరిగిన అవినీతి పై బహిరంగ విచారణ జరుగుచున్నoదున గ్రామం లో దండోరా వేయిoచాలని, బందోబస్త్ ఏర్పాటు చేయాలని కోరారు.2. మందస నుండి గార సూర్యనారాయణ ఫోన్ చేసి తాను గతం లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో వాచ్ మన్ గా అవుట్ సోర్స్ లో  పని చేసానని, హాస్టల్ మూసి వేయడం వలన ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని  బ్రతుకు తున్నాను. HRMS లో వివరాలు ఉన్నందున తెల్ల రేషన్ కార్డు మంజూరు కావడం లేదు.  అందులో గల వివరాలు తొలగించి, తెల్ల రేషన్ కార్డు శాంక్షన్ చెయ్యాలని కోరారు.
3.ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామం నుండి అనాజి  ఫోన్ చేస్తూ  ఆదరణ పధకం నకు డబ్బులు కట్టామని,  తమకు పరికరాలు గాని, డబ్బులు గాని ఇప్పించాలని కోరారు.
4.పాలకొండ నుండి కె. రామారావు ఫోన్చేస్తూ అగ్రి గోల్డ్ లో డిపాజిట్ చేసిన డబ్బులు ఇప్పించాలని కోరారు.
5.నరసన్నపేట మండలం తోటాడ గ్రామం నుండి పి. వెంకటేశ్వరరావు  ఫోన్ చేసి తమ గ్రామంలో సర్వే నెంబర్ 17-4లో గల చెరువు ను ఆక్రమించి ఉలవ చేను సాగు చేస్తున్నారని,  ఆక్రమణలు తొలగించిoచాలని పిర్యాదు చేశారు.6.జలుమూరు  నుండి సి. పూర్ణచంద్ర రావు ఫోన్ చేసి తమ భూములకు మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసుబుక్, టైటిల్ డీడ్ ఇప్పించాలని కోరారు.7.కొత్తూరు మండలం బలడ గ్రామం  నుండి రెడ్డి ఉమామహేశ్వర రావు ఫోన్ చేసి పంచాయతీ సెక్రటరీ విధులకు సక్రమంగా హాజరుకావటం లేదని, చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.8.ఇచ్ఛాపురం నుండి బి. శ్రీనివాస రావు ఫోన్ చేసి ఇచ్ఛాపురం లో ఆధార్ నమోదు కేంద్రం ఎర్పాటు చేయాలని కోరారు.
9.హిరమండలం మండలం  పిండ్రువాడ గ్రామం నుండి పి. శివ నారాయణ ఫోన్ చేసి తమ భూములలో ప్యూర్ విన్ అగ్రో లిమిటెడ్ కంపెనీ ఎర్పాటు చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారని,  దానిని నిలుపుదల చేయాలని పిర్యాదు చేశారు.