శ్రీకాకుళం : నవంబరు 20 : జిల్లాలో ఎస్.సి, ఎస్.టి బ్యాక్ లాగ్ ఖాళీల తాత్కాలిక మెరిట్ జాబితాను ప్రకటించామని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తాత్కాలిక జాబితాను srikakulam.ap.gov.in వెబ్ సైట్ తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయం, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయాల నోటీసు బోర్డులో పెట్టడం జరిగిందన్నారు. ఈ జాబితాలను ఈ నెల 21వ తేదీ నుండి డిశంబరు 5వ తేదీ వరకు అభ్యర్ధుల పరిశీలన నిమిత్తం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్ధులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల లోగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు.
జిల్లాలో యస్.సి, యస్.టి బ్యాక్ లాగ్ పోస్టుల జాబితా రిలీజ్