శ్రీకాకుళం : నవంబరు 16 : రాష్ట్ర ఉన్నత విద్య రెగ్యులేటరి మరియు మోనిటరింగు కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆదివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం చేరుకుని స్ధానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, అనంతరం సాయంత్రం 4 గంటలకు టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శిస్తారని ఆయన చెప్పారు. రాత్రికి శ్రీకాకుళంలో బస చేసి సోమవారం ఉదయం బయలు దేరి విశాఖపట్నం వెళతారని ఆయన పేర్కొన్నారు.
రేపు ఉన్నత విద్య రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ జిల్లాకు రాక