కల్లేపల్లిలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : నవంబరు 16 : ప్రజలకు అందుబాటులో ఇసుకను ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. శ్రీకాకుళం మండలం కళ్ళేపల్లి గ్రామం వద్ద నాగావళి తీరంలో శని వారం ఇసుక రీచ్ మరియు స్టాక్ పాయింట్ ను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి  క్రిష్ణ దాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పద్దతి ప్రకారం వ్యవహారాలు జరగాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఉండాలని, పారదర్శక పాలనను జగన్ అందిస్తున్నారని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 18 రీచ్ లు, 6 ఇసుక నిలువ కేంద్రాలు ప్రారంభించామన్నారు. టెక్కలి లో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా 4.50 టన్నులకు (ఒక ట్రాక్టర్) ధరలను నిర్ణయించామని తెలిపారు. జిల్లా కోసం ప్రత్యేకంగా పర్లాం రీచ్ ను కేటాయించామని తెలిపారు. జిల్లాలో రోజుకు 10 వేల టన్నుల ఇసుకను తవ్వడం జరుగుతోందని పేర్కొంటూ రాష్ట్రంలో 10 శాతం మన జిల్లాలోనే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు.గనుల శాఖ ఉపసంచాలకులు ఎస్ కె వి సత్యనారాయణ మాట్లాడుతూ టన్నుకు రూ.375 ధరను నిర్ణయించామన్నారు. ఇసుక కావలసిన వారు ఏపిఎండిసి పేరున చలాను తీయాలని అన్నారు. ఇసు రీచ్ ల వలన స్ధానికులకు ఉపాధి కలుగుతుందని, ట్రాక్టర్లకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎంవి రమణ, తహశీల్దార్ ఐ టి కుమార్, స్థానిక నాయకులు ఎచ్చెర్ల సూరిబాబు, గొండు కృష్ణ మూర్తి, గొండు రఘురాం, మూకళ్ల తాత బాబు, రీచ్ నిర్వాహకులు వి.వి.రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.