హైదరాబాదు : నవంబరు 9 : చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులన పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, సర్పంచ్‌లు ఎండీ అహ్మద్ పాషా, గండి కుమార్, బీజేపీ నాయకులు బలరాం ఆలె, శోభన్ మోహన్, ఎల్కతుర్తి రాజన్న రవి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేతలు గీస సంపత్, తౌటం ప్రభాకర్, మరోజు కృష్ణమచారి, గొర్రె శశికాంత్, తాటికంటి రవికుమార్, తోట ఓదేలు, పున్నం మల్ల రెడ్డి, కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపుర్‌లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీజేపీ నాయకుల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన 17 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులను.. ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇంత నిర్బంధం దేశంలో ఎక్కడా లేదని, ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని చూడలేదని వాపోయారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.
చలో ట్యాంక్బండ్ విఫలయత్నం