వరంగల్ : నవంబరు 13 : ప్రస్తుత సమాజంలో పేగుబంధానికి విలువలు పూర్తిగా పడుపోతున్నాయి. కని పెంచిన కొడుకుకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని తల్లిదండ్రులు కట్టేసి మరి చంపేస్తున్నారు.వరంగల్ జిల్లా దామెర మండలంలో కన్న కొడుకునే సజీవదహనం చేసిన ఘటన సంచలనంగా మారింది. ముస్తాలపల్లికి చెందిన కడారి మహేష్ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్ చదువుతుండగా కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మద్యానికి బానిసైన మహేష్ నిత్యం తాగివస్తూ భార్యను వేధించసాగాడు. దీంతో భర్త టార్చర్ భరించలేక కొద్ది నెలల క్రితం భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి మహేష్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే వారిని కూడా నిత్యం మద్యం కోసం డబ్బుకావాలంటూ వేధించసాగాడు. అంతేకాదు వారిపై దాడి కూడా చేసేవాడు. అయితే ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో కొడుకు చేస్తున్న టార్చర్ భరించలేక ఆ తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మద్యం మత్తులో ఉన్న మహేష్ చంద్రపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో మహేష్ సజీవదహనమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని మహేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
మానవత్వం మట్టిలో కలుస్తున్న వేళ