శ్రీకాకుళం : నవంబరు 19 : బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా రేపు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు జి.జయదేవి పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 10గంటలకు స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు బాలబాలికలతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.
రేపు బాలల హక్కుల వారోత్సవాలలో బాగంగా