భువనేశ్వర్ : నవంబరు :18 అనుగుల్ జిల్లా పలహాడ్ ప్రాంతంలో అటవీ అధికారులు, సిబ్బంది ఓ అలుగును కొందరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదుకున్న అలుగు 10 కిలోల బరువు ఉంది. పటాముండా గ్రామానికి చెందిన సంతోష్ మహకుద్, కైలాష్ నాయక్, టైనిసిరా గ్రామానికి చెందిన గణనాథ్ నాయక్, జగమోహన్‌పూర్‌కి చెందిన మునా ముండాను అరెస్టు చేశారు. మునా ముండా రెండు నెలల క్రితం అడవిలో వేటాడి అలుగును పట్టి తన ఇంట్లో ఉంచాడు. దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో వ్యాపారుల్లా నటిస్తూ ఆయన ఇంటికి అటవీశాఖ సిబ్బంది వెళ్లారు.
మునా ముండాతో కలిసి అలుగుల వ్యాపారం చేసే మిగిలిన ముగ్గురు కూడా ఆయన ఇంటికి వచ్చారు. బేరం ఆడినట్లు నటించిన అటవీశాఖ సిబ్బంది అలుగును చూపించాలని కోరారు. వారు దాన్ని చూపించడంతో స్వాధీనం చేసుకొని నలుగురినీ అరెస్టు చేశారు.
ఇంట్లో అలుగు , అటవీ అడవీ అధికారులకు అప్పగింత