న్యాయం కోసం నిరాహార దీక్ష

పాలకొండ : నవంబరు 11: కురామాన జమ్మయ్య హత్య కేసును సీబీ,సిఐడి కు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షను దళిత సంఘాల జేఏసీ పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో రిటైర్డ్ యమ్. ఇ. ఓ దూసి.భూషణ్ ప్రారంభించారు. అవలంగి గ్రామ దళితుడు  కురమాన జమ్మయ్య హత్య గావింప బడిన కేసులో మిగతా హంతకులను పట్టుకోవాలని , చనిపోయిన దళితుడు కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నాము.అంతేకాకుండా కేసు దర్యాప్తు లో పెద్ద పురోగతి లేదు. అందువలన ఈ కేసును సీబీ,సి.ఐ. డి కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి 13వ తేదీ వరకు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరాహారదీక్షలు దళిత సంఘాల జేఏసీ చేపట్టడం జరిగింది.