సంతకవిటి : నవంబరు 14 : సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో ? దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో ? తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్ తప్పని సరి అయ్యింది మరి. అది లేందే పూట గడవని పరిస్థితి. గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న మాటలవల్ల రేడియేషన్ ప్రభావం మెదడుకు పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఈ రేడియేషన్ దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ బ్యాన్ సంస్థకు చెందిన పలు యాంటీ రేడియేషన్ ఉత్పత్తులు సైతం మార్కెట్లోకి అందు బాటులోకి వచ్చాయి. ఈ సెల్ రేడియేషన్ కారణంగా సంభవిస్తోన్న, ఆరోగ్య సమస్యలను అన్నీఇన్నీ కావు.
ప్రస్తుత రోజుల్లో పక్కలో పెళ్ళాం, ఎదురుగా ఉన్న పిల్లల కంటే మొబైల్ ఫోన్లతో నిద్రపోతున్నారు. నిద్రలేవగానే, తల్లిదండ్రులకు లేదా పిల్లలకు లేదా భాగస్వామికి గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం కంటే నిద్రలేవగానే మొబైల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. మొబైల్ వాడకం ఎక్కువగా ఉన్న ఈ జనరేషన్ లో మొబైల్ ఫోన్లు, సరదాలకు, ప్రిస్టేజిలకు అద్దం పట్టేలా ఉన్నాయి. అందుకే రోజుకో మోడల్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. కానీ, ప్రతినిత్యం మొబైల్ ఫోన్లను ఉపయోగించే వారికి, వాటివల్ల ఏర్పడే భయంకర ఆరోగ్యప్రమాధాల గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. అది వ్యాపారం వ్యవహారం మంచి చెడు వార్తలు తెలపటంలో చాలా ఉపయోగకారి. అలాంటి సెల్ ఫోన్ పని చేయాలంటే దానికి అత్యంత అవసరం సిగ్నలింగ్ వ్యవస్థ. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబున్నామంటే శ్రీకాకుళం జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న సంతకవిటి మండలంలోని చివారు గ్రామాలకు అనగా కావలి,వాల్తేరు,జి.యన్.పురం,పనసపేట,చిత్తారుపురం, గుజ్జన్న పేట మొదలైన గ్రామాలకు నేటి నుండి ఆ సమస్య "జియో" నెట్వర్క్ ద్వారా తీరింది. వాల్తేరు గ్రామంలో స్థానిక యమ్.పి.టి.సి.యువకుడు, వై.యస్.ఆర్. పార్టీ సంతకవిటి మండల కార్యదర్శి గురుగుబెల్లి స్వామినాయుడు చొరవతో టవర్ నిర్మాణం జరిగింది. అన్ని అనుమతులు పూర్తి చేసుకొని ఈ రోజు నుండి సిగ్నల్ అందుబాటులోకి రావటంతో అందుబాటులో ఉన్న గ్రామాల ప్రజలు "స్వామినాయుడును" అభినందిస్తున్నారు. ఇలాంటి యువ నాయకుని మండల అధ్యక్షుడుగా పార్టీ చొరవ తీసుకొని నియమించిన మండల ప్రజల అభివృద్ధికి తోడ్పడుతాడని ఆనోటా ఈనోటా అనుకోవడం తుది మెరుపు.
వాల్తేరులో జియో టవర్ సిగ్నల్ ప్రారంభం