శ్రీకాకుళం : నవంబరు 12 : నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సి.ఎం. జిల్లా కలెక్టర్లు,అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎరువులు,విత్తనాల కొరతను అధిగమించాలని, గ్రామాలలోని సెక్రటేరియట్ కార్యాలయాలకు దగ్గరలోనే విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్, ఇసుక రీచ్ లు, మత్స్య కార భరోసా, రైతుభరోసా, పాఠశాల విద్య, స్పందన కార్యక్రమం, ఇళ్ళ స్థలాల పంపిణీ తదితర కార్యక్రమాల నిర్వహణపై ముఖ్య మంత్రి సమీక్షించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి :సి.యమ్