ఉగాదికి ఇల్ల పట్టాలివ్వాలి : సి.యమ్.

అమరావతి : నవంబరు 12 : ఉగాది నాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని,ఇది మనకు మానస పుత్రిక వంటిదని, ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశమంతా ఈ కార్యక్రమంపై మాట్లాడుకుంటోదని, దీన్ని బట్టే మన పాలన ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం కార్యాలయంలో మంగళవారం చేపట్టిన సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం జగన్‌ పలు కీలక సూచనలను చేశారు. ప్రతి గ్రామంలోనూ పథకాలపై సోషల్‌ ఆడిట్‌ జరగాలని ఆదేశించారు.సమీక్ష సందర్భంగా సీఎం అధికారులతో చర్చిస్తూ ప్రతి గ్రామంలోనూ సోషల్‌ ఆడిట్‌ చేయాలి. ఇంకా ఎక్కడైనా పొరపాట్లు కారణంగా ఎవరైనా మిగిలిపోతే వారి విజ్ఞప్తులనూ పరిగణలోకి తీసుకోండి. వచ్చే రైతు భరోసాలో వారికి మళ్లీ లబ్ది కలిగే అవకాశం ఉంటుంది. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేయాలి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, వచ్చే నాలుగు నెలల్లో మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇంకో ఎత్తు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించండి, లేని పక్షంలో భూమలు కొనుగోలు చేసి ఇల్ల పట్టాలు ఇవ్వాలని చెప్పారు.