అమరావతి : నవంబరు 9: అయోధ్యలోని రామజన్మభూమి అలాగే బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రజలంతా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విఙ్ఞప్తి చేశారు.అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు. ఇటువంటి పరిస్థితులలో మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టేలా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.కాగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలు రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు(సున్నీ వక్ఫ్ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించింది
అయేధ్య రామ జన్మభూమి బాబ్రీమసీదుల తీర్పు నేపధ్యంలో ప్రజలు సంయమనం పాటించాలి : సి.యమ్.జగన్ మోహన్ రెడ్డి