గ్రంధాలయాలు మన చరిత్రకు సజీవ సాక్షులు

శ్రీకాకుళం : నవంబరు 14 : గ్రంధాలయాలు మన చరిత్రకు వారధులని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె. కుమార్ రాజా అన్నారు. 52వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను గురువారం ఉదయం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆవరణలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1968 నుండి గ్రంధాలయ వారోత్సవాలు నిరంతరాయంగా జరుగుతున్నాయని అన్నారు. భారత దేశ తొలి ప్రధాని భారత స్వాతంత్ర్య పోరాటములో ప్రముఖ పాత్ర పోషించి, పండితిజీగా ప్రాచుర్యం పొందినట్టు తెలిపారు.ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకానికి అభివర్ణించారు.పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మ దినమును పురస్కరించుకొని గ్రాంధాలయ వారోత్సవాల్లో బాలలను బాగస్వాములను చేసి వారికి ఉన్నత విద్యను అభ్యసించడం తద్వారా వారి భవిష్యత్తును తీర్చి దిద్దడానికి గ్రంధాలయాలన్నీ ఒక వేదిక చేయడం వారోత్సవాల ముఖ్యుఉద్దేశమని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని పాఠశాలల నుండి విద్యార్ధి, విద్యార్ధులను గ్రంధాలయ ప్రాంగణమునకు రప్పించి వివిధ అంశాలుపైన వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి వారిని ఉత్సాహ వంతం చేయడం జరుగుతుందని చెప్పారు. శెలవు రోజుల్లో గ్రాధాలయాలు పనిచేస్తాయి కాబట్టి వీటిని వినియోగించుకొని భవిష్యత్తును తీర్చిదిద్గుకోవాలని కోరారు. అనేక పత్రికలు మీడియా ప్రసారాలు ఉన్నప్పటికీ పుస్తక పఠనం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చిని అన్నారు.ఇంటాక్ కన్వినర్ రాదాప్రాసాద్ మాట్లడుతూ గ్రంధాలయ వారోత్సవాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటాక్ కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టరు ఆదేశాలు మేరకు ఇంటాక్ తరువున గ్రంధాలయానికి కళింగాంధ్ర చరిత్ర, స్టోరీ ఆప్ స్టోన్ బుస్స్ 5 పుస్తకాలు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ రీడర్స్ ఫోరం అధ్యక్షులు డా. ఇ.ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రంధాలయాలను అందరూ వినియోగించుకొని, ఆధ్యాత్మికి పుస్తకాలు, శతకాలు, నీతికథలు చదువుకోని నీతి నిజాయీతీతో జీవించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రంధాలయం డిప్యూటీ లైబ్రేరియన్ జి. తిరుమల కుమారి, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్.వి. రమణమూర్తి, గ్రంధాలయ సిబ్బంది పి. మురళీకృష్ణమూర్తి, పి. ఈశ్వరరావు, పి. రామ్మోహన్, అమర్ నాధ్ తదితులు పాల్గొన్నారు.