బాల్య వివాహాలు నిర్మూలనే ధ్యేయం

శ్రీకాకుళం : నవంబరు 14 : శ్రీకాకుళం జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లా గా తీర్చి దిద్దిడమై కొలాబ్ ఎన్.జి.ఓ సంస్థ ముఖ్య ఉద్దేశమని బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు, చైల్డ్ లైన్ డైరెక్టర్ ప్రసాదరావు పేర్కొన్నారు. బుదవారం ఉదయం వై.సి.బి కొలాబ్ ఆఫీసు ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భం పురష్కరించుకొని నేటి నుండి 20 తేదీ వరకు చైల్డ్ లైన్ వారోత్సవాలు నిర్వహించ నున్నట్టు తెలిపారు. రెనెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు, విద్యా శాఖ, ఆర్.వి.ఎమ్. తదితర ప్రభుత్వ శాఖల సహాయ సహకారంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలలకు స్నేహ పూర్వకమైన జీవితం అందించడమే చైల్డ్ లైన్ ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. బాలలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు టోల్ ప్రీ నెంబరు 1098 ఫోన్ చేసినట్లయితే ఫోన్ చేసిన 60 నిమిషాల్లో ఆ ప్రదేశానికి చేరుకుని, అక్కడ పరిస్థితి నిర్ధారణ చేసి చైల్డ్ లైన్ కమీటీ ముందు పెట్టడం జరుగుతుందని, అవసరమైతే బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయించడం జరుగుతుందని తెలిపారు. క్రిష్ణా, ప్రకాశం,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పోల్చి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో బాల్య వివాహాలు బాగా తగ్గాయని, ఇంకా వీటిని నిర్మాలించాలనే ఉద్దేశముతో బాల్యవివాహాలుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కౌమార దశలో ఉన్న బాలలకు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. మహిళాసంఘాల సభ్యుల, నరేగా జాబ్ కార్డు హోల్డర్స్ తోను బాల్య వివాహాల చట్టాలు గురించి తెలియజేయడం జరిగిందని చెప్పారు. బాల్య వివాహాలు నివారణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటు తెలిపారు. ప్రధానంగా పోలీసు శాఖ వారు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం నెల రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లోను, మండల కేంద్రాల్లోని పర్యటించి బాలకార్మికులను రెస్క్యూ చేసి చట్టము ముందు పెట్టి చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. దీనివల్ల ప్రతి పిల్లవానికి విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధముగా చదువుకున్న ఆమ్మాయి రాములమ్మకు ట్రిపుల్ ఐటి లో సీటు వచ్చినట్టు తెలిపారు.శ్రీకాకుళం జిల్లాలో చైల్డ్ లైన్ సంస్థ 2011 సంవత్సంలో ప్రారంభించడం జరిగిందని, నేటి వరకు బాల్య వివాహాలు, బాల కార్మికులకు సంబంధించి 1685 కేసులు నమోదు ఆయినట్టు తెలిపారు. 880 కేసులు చట్టము ముందు ఉంచడం జరిగిందని, 23 కేసులు లైంగిక వేధింపు చట్టం క్రింద కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 328 మందికి కె.జి.బి.వి పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, చిల్డ్రన్ హోమ్ లకు అప్పగించడం జరిగిందని చెప్పారు. బాల కార్మిక నిషేద చట్టం కింది 46 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.