రైతు బజారులో రాయితీపై ఉల్లి

శ్రీకాకుళం : నవంబరు 19 : బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరగడంతో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉల్లి కిలో ధర 50 రూపాయలు నుంచి 60 రూపాయలు వరకు ఉంది. దీంతో జిల్లాకు కర్నూలు నుంచి సోమవారం ఉదయాన్ని ఉల్లి పాయలు రాగా రైతుబజారులో వెంటనే రాయితీపై ఉల్లి పాయల విక్రయాలు ప్రారంభించారు.25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు అందజేస్తున్నారు. వినియోగదారుడు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని వెళితే ఒక్కో కార్డుకు కిలో చొప్పున ఇస్తున్నామని రైతుబజారు ఎస్టేట్‌ అధికారి రాజశేఖర్‌ తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.