హైదరాబాదు : నవంబరు 15 : పండుగలు,పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు.ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు.దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది.ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు.ఈ ప్రక్రియ పూర్తిగా సిద్ధంగా ఉన్నందున ఈ విధానాన్ని ముందు అనుకున్న సమయానికే అమలు చేయబోతున్నామని మూడ్రోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
తోల్ గేట్లలో లేదు ఇక లేటు