రేపల్లి : నవంబరు 10 : ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు తక్షణమే కరువు భత్యం అందించాలని ఎఐటియుసి రేపల్లె ఏరియా గౌరవ అద్యక్షులు గొట్టుముక్కల బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చెరుకుపల్లిలో విలేకరులతో మాట్లాడుతుా గత ఆరు నెలలుగా ఇసుక భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. ఆర్దిక ఇబ్బందులు పడుతున్న కార్మికుల కుటుంబాలకు 20 వేలు కరువు భత్యం అందించాలన్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో జిల్లాలో ఇప్పటి వరకు 12 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు తక్షణమే కరువు భత్యం ఇవ్వాలని కోరుతుా శనివారం ఉదయం 10 గంటలకు గుాడవల్లి గ్రామంలో జరుగుతున్న సమావేశంలో కార్మికులు పాల్గొని సమావేశాని విజయవంతం చేయాలని బాలాజీ కోరారు.
ఇసుక కొరతను ప్రభుత్వం వెంటనే నిర్మూలించాలి