శ్రీకాకుళం : నవంబర్ 4 : డయల్ యువర్ కలెక్టర్ కు 11 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ. కల్యాణ్ చక్రవర్తి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోన్ కాలర్స్ పి.డికి ఫోన్ చేస్తూ తమ సమస్యలను విన్నవించారు.మొదటిగా పలాస నుండి పి. అనూష ఫోన్ చేస్తూ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ఉండడం లేదని, అడిగిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారని, కావున వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.రాజాం మండలం జి.చీపురుపల్లి నుండి కె.అర్జునరావు ఫోన్ చేస్తూ సర్వే నెంబర్. 146, 160, 162, 263 లలో అక్రమ మైనింగ్ జరుగుతుందని, భాద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.జి.సిగడం మండలం దుగ్గివలస నుండి ఎస్. గోపాలనాయుడు ఫోన్ చేస్తూ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం నుండి జి.గణేష్ కుమార్ ఫోన్ చేస్తూ తమ గ్రామంలో పాఠశాలకు దగ్గరలో మద్యం దుకాణం ఉందని, దానిని వేరొక ప్రదేశానికి మార్పుచేయాలని కోరారు.టెక్కలి నుండి పి.చిట్టెమ్మ ఫోన్ చేస్తూ సర్వే నెంబర్ 393కు సంబంధించి పొజీషన్ సర్టిఫికేట్ ను మంజూరు చేయడంలేదని ఫిర్యాదు చేశారు.పలాస మండలం అనంతవరకోట నుండి కె. ఢిల్లీశ్వరరావు ఫోన్ చేస్తూ ఆరు మాసాల గర్భిణీ అయిన తమ కోడలికి అంగన్వాడీ కార్యకర్త పౌష్టకాహారం అందించుటలేదని పిర్యాదు చేసారు. వజ్రపుకొత్తూరు మండలం కొమరంతాడ నుండి జె.తులసిఫోన్ చేస్తూ గ్రామ కార్యదర్శుల పోస్టుల రాత పరీక్షలలో 47 మార్కులు వచ్చిన తనకు 3వ లిస్ట్ లోనైనా గ్రామ కార్యదర్శి పోస్టును ఇప్పించాలని కోరారు.టెక్కలి నుండి డి. వి.ఎస్. జ్యోతి ఫోన్ చేసి మాట్లాడుతూ తమ ఇంటి ప్లాన్ అప్రూవల్ కోర్టు ఆర్డర్ పెండింగ్ లో ఉన్నందున DPO చర్యలు ఆపాలని కోరారు.వీరఘట్టం మండలం తాళేవరం నుండి బి. ఈశ్వరరావు ఫోన్ చేస్తూ రేషన్ కార్డు నుండి తన పేరు తొలగించి, కొత్త కార్డు యివ్వాలని కోరారు.అదే మండలం నడుకూరు గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా వున్నదని, మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయని, కావున పంచాయతి అధికారులు చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు.పొందూరు మండలం రాపాక నుండి పి. కిషోర్ కుమార్ ఫోన్ చేస్తూ తమ గ్రామంలో రచ్చబండ, డ్రైనేజీ మరామ్మతు పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసారని, కావున భాద్యులపై చర్యలు తీసుకో వాలని ఫిర్యాదు చేశారు.
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమానికి పిర్యాదులు