సచివాలయ వార్డు/గ్రామ కౌన్సిలింగ్ త్వరగా చేయాలి : జిల్లా కలెక్టరు

శ్రీకాకుళం : నవంబరు 18 : సచివాలయ ఉద్యోగ నియామక కౌన్సిలింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.సోమవారం స్పందన కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగ నియామక కౌన్సిలింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ నియామక ప్రక్రియను  జాప్యం చేయరాదన్నారు. పోస్టులనారీగా వున్న ఖాళీలను గుర్తించాలనీ,త్వరితగతిన కౌన్సిలింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.