మైనారిటీ వర్గాల ప్రజలు విధ్యావంతులు కావాలి

శ్రీకాకుళం : నవంబరు 11: మైనారిటీ వర్గాల ప్రజలు వున్నత విద్యను అభ్యసించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు.సోమవారం స్ధానిక బాపూజీ కళామందిరంలో నిర్వహించిన భారత రత్న మౌలానా అబుల్ కలామ్ అజాద్ 132వ జన్మదినోత్సన సందర్భంగా ఏర్పాటు చేసిన మైనారిటీ  సంక్షేమ దినోత్సవానికి స్పీకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలానా అబ్దుల్ కలాం అసలు పేరు మోహిద్దీన్ అహ్మద్ అని, మౌలానా అంటే గురువు అని, అబుల్ కలాం అనేది బిరుదు అని, అజాద్ అనేది ఆయన కలం పేరు అని వివరించారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడని, హోమ్ రూల్ మూమెంట్ వంటి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని తెలిపారు.పత్రికా సంపాదకునిగా అనేక సేవలనందించారని చెప్పారు.  భారత రత్న పొందిన తొలి ముస్లిమ్ అయిన అబ్దుల్ కలాంను మహాత్మా గాంధీ, ఇండియన్ ప్లాటో అని పిలిచే వారని చెప్పారు.దేశ సమగ్రత, సమైక్యతకోసం ఎంతో కృషి చేసారని, భారత దేశానికి మొదటి విద్యా మంత్రిగా ఆయన  పనిచేసారని చెప్పారు. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తున్నదన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి అనేక  కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.  జెరూసెలాం, హజ్ యాత్రలకు 30 నుండి 60 వేల రూపాయలు వరకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నదన్నారు. విదేశీ విద్యకు రూ. 420 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 20 కోట్ల రూపాయలుతో సబ్సిడీలు , ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వృత్తి నైపుణ్యానికి సైతం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.  ఇళ్ళస్ధలాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.  వై.ఎస్.ఆర్. భరోసా పథకాన్ని మైనారిటీలకు వర్తింపచేయడం జరుగుతుందన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని,తమ పిల్లలను బగా చదినించుకుని అభివృధ్ధి చెందాలన్నారు. ముస్లిమ్ వర్గాలకోసం కేటాయించిన ఉద్యాగాలు చాలా ఖాళీగా వుండడం చాలా బాధాకరమన్నారు.అందరం కలసి తెచ్చుకున్న స్వాతంత్ర్య ఫలాలను కలిసి అనుభవించాలన్నారు. ముఖ్యమంత్రి నిబధ్థతతో పని చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి వున్నారని తెలిపారు.జిల్లా కలెక్టర్  జె. నివాస్ మాట్లాడుతూ, మైనారిటీలకు విద్య అవసరం అని చెప్పిన వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని తెలిపారు. ప్రస్తుతం  సచివాలయ నియామకాలలో బి.సి ఇ లో కూడా ముస్లింలు లేకపోవడం బాధా కర మన్నారు.విద్య పట్ల ఇంకా శ్రద్ద వహించాలని, పిల్లల ఇష్టం మేరకు ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేద స్థితి నుండి వచ్చారని, చదువు కోసం 300 కి.మీ.ప్రయాణించేవారని తెలిపారు. వున్నత చదువులకోసం,అక్క గాజులు అమ్మి చదివించారని తెలిపారు. బాగా చదువుకుని దేశానికి రాష్ట్రపతి అయ్యారని,  మహోన్నత శాస్త్రవేత్త కాగలిగారని చెప్పారు.ఈ రోజు మైనారిటీ దినోత్సవం మాత్రమే కాదు జాతీయ విద్యా దినోత్సవమని,విద్య ప్రాధాన్యత తెలుసుకొని చిన్నారులను విద్యావంతులను చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు ఇతర సౌకర్యాలు ఉపయోగించుకుని అభివృధ్ధి సాధించాలన్నారు. మహిబుల్లా ఖాన్ మాట్లాడుతూ బురిడీ కంచరాంలో 637 ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురి అయ్యాయని  చెప్పారు. ఇమామ్ లకు 3 నెలలుగా పారితోషికం సిఎఫ్ఎంఎస్ సమస్య వలన అందటం లేదని దానిని అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలుకావడం లేదని,వై యస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలుచేశారని చెప్పారు. ఇపిడిసిఎల్ నియామకాలలో ముస్లిం రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించడం లేదని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి వుందన్నారు. శ్మశాన వాటికలు బాగుచేయించాలని, ఇమామ్ లకు జీతాలు పూర్తిగా విడుదల చేయాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తామని స్పీకర్ హామీనిచ్చారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో హాజరైన జిల్లాకు చెందిన కాంచన మాలకు , వ్యాస రచన, వ్యక్తృత్వపు  పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముస్లిం పెద్దలను  సత్కరించారు. అనంతరం స్పీకర్ మరియు జిల్లా కలెక్టర్లను ముస్లిమ్ పెద్దలు సత్కరించారు.ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ తరపున విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు  కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అబ్దుల్ వాహబ్ జామియా మసీదు ఇమామ్ అలీ జాన్, సుకూర్ ఖాన్, ఎం.ఎ భాషా, సలీం భాయ్, హాజీ షరీఫ్ రాజా, ఎస్.కెబహుద్దూర్, చోటూ భాయ్, ఇక్బాల్ ఎం.ఎ. బైగ్, ఎస్.కె.షాన్వాల్, బహద్దూర్ జానీ ఎస్ కె సుభాషిణి, అన్వరీ బేగం, ఎలీషా తదితరులు హాజరైనారు.