రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

శ్రీకాకుళం : నవంబరు 20 : శ్రీకాకుళం నగరం లో గల టౌన్  హాల్ లో బుదవారం  జిల్లా స్థాయి అండర్ 14,  బాలబాలికల ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. మద్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ మండలానుంచి 300ల మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముందుగా ఈ పోటీలను జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్  ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె.రాజారావు  ప్రారంభించారు. ఈ పోటీల్లో బంగారం పథకం సాధించిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేసారు. ఈ నెల 24 నుంచి 27వ తేది వరకూ  కర్నూలులో జరిగే ఈపోటీల్లో క్రీడాకారులు తలపడతారని స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె.రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్ధులు ఫెన్సింగ్ లో చూపిన ప్రతిభ అందరినీ అలరించిందని పాఠశాల స్థాయినుంచే విద్యార్ధు  శిక్షణ పొందితే జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన అన్నారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్ధులకు అవసరమన్నారు. ఈ ఎంపికలకు ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సంథింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వైశ్య రాజు మోహన్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, పిఇటిలు ,పిడిలు పైడి సునీత, డి.భవాని,డి. యశోద, పైడి పెద్ది శ్రీను, గురుగుబెల్లి  రాజశేఖర్, బి.పుష్పలత,రాజేశ్వరి తోపాటు శిక్షకులు , , మజ్జి గౌతమ్, పి. నవీన్, ఎ. సతీష్,తదితరులు పాల్గొన్నారు.