శ్రీకాకుళం : డిశంబరు 13 : జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలలోను మెరుగైన రినెవేటిన్ టాయ్ లెట్లను నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు. శుక్రవారం కలెక్ట్ ఛాంబర్ లో మార్పు కార్యక్రమంలో భాగంగా హాస్టళ్ళలో పరిశుభ్రమైన టాయ్ లెట్ల నిర్మాణాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.టాయ్ లెట్ల డిజైనింగ్ సరిగా చేపట్టాలన్నారు.ప్లంబింగ్ వర్కు పరిశుభ్రంగా చేయాలన్నారు.టాయ్ లెట్ గదిలో గ్రీన్ కార్పెట్ సౌకర్యం కలిగించాలని. తద్వారా పరిశుభ్రత కలగుతుందని చెప్పారు. ఆర్.అండ్ బి ద్వారా పోలాకి, సోంపేట, రణస్ధలం, అదపాకలలో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన పనులకు టెండర్లు పిలవాలని ఆర్.అండ్.బి. అధికారులు తెలిపారు. పంచాయితీరాజ్ లో 29 పనులకు గాను 15 పనులకు టెండర్లు పూర్తయ్యాయని పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. టెండర్ల ప్రక్రియ 15 రోజులలోగా పూర్తి చేయాలని, అన్ని వర్కులు గ్రౌండ్ కావాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. టాయ్ లెట్ రినోవేషన్ కు ముందు, రినోవేషన్ చేసిన తరువాత ఫోటోలను తీయాలని చెప్పారు.ఎ.ఇ.లు వారంలో ఒక రోజు పనుల ప్రగతిని పర్యవేక్షించాలని, త్వరిత గతిన టాయ్ లెట్ నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి పి.రజనీకాంతారావు, ఆర్.అండ్.బి.ఎస్.ఇ. కాంతిమతి, ఎ.పి.ఇ.డబ్ల్యు.ఐ.సి.ఇ.ఇ. భాస్కర రావు, పంచాయితీరాడ్ డి.ఇ. కొత్తూరు రాధారాణి, కె.ఎం.వి. ప్రసాదరావు, పబ్లిక్ హెల్త్ డి.ఇ. విజయకుమార్, సర్వశిక్ష అభయాన్ ఎపిఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు హాజరైనారు.
గురుకుల పాఠశాలలలో రినోవేటిన్ టాయ్ లెట్లు : జిల్లా కలెక్టర్ జె.నివాస్