జిల్లాలో 1265 గ్రామ సచివాలయ పోస్టులు ఖాళీ

కర్నూలు : జిల్లాలో 1265 గ్రామ సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటికి త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని జడ్పీ ఇన్‌చార్జి సీఈవో ప్రభాకరరావ్‌ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ జిల్లాకు 9850 పోస్టులు మంజూరు కాగా ఇప్పటి వరకు 8312 ఉద్యోగులు విధుల్లో చేరారని,168 పోస్టులు క్రీడల కోటా కింద భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పశుసంవర్దకశాఖలో 674, ఉద్యానశాఖలో 92, డిజిటల్‌ సహాయకులు 110, సర్వేయర్లు 139, వార్డు ఎమెనిటీస్‌ కార్యదర్శులు 53, వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు 59, ఇతరత్రా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన తర్వాత నిబంధనల మేరకు భర్తీ చేస్తామని ప్రభాకరరావ్‌ తెలిపారు.