శ్రీకాకుళం : డిశంబరు 5 : ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగు ఉద్యోగుల వివరాలు సమర్పించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి అన్నారు. గురు వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవుట్ సోర్సింగు ఉద్యోగుల వివరాలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ మాట్లాడుతూ ప్రభుత్వం అవుట్ సోర్సింగు ఉద్యోగుల నియామక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు ఉద్యోగాల్లో 50 శాతం మేర బి.సి,ఎస్.సి,ఎస్.టి,మైనారిటి ఉండాలన్నారు. ప్రతి కేటగిరిలో 50 శాతం మహిళలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఇప్పటికే కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగు ఉద్యోగుల వివరాలు సమర్పించాలని అన్నారు. అందులో ఏ కేటగిరి ఏ మేరకు ఉన్నారో తెలియజేయాలని చెప్పారు.ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాస రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో అవుట్ సోర్సింగు ఉద్యోగుల వివరాలు సమర్పించాలి