శ్రీకాకుళం : డిసెంబర్ 28 : ఈ నెల 30వ తేదీన స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఉదయం 10గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంకు చెందిన బొనంజా హ్యూమన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డి.డి.యు.జె.కె.వై ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధికల్పనకు ఉచిత వసతి, నైపుణ్య శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8, 10 తరగతుల విద్యార్హత కలిగి 18-35 సం.ల వయస్సు లోపుగల అభ్యర్ధులు చికెన్ హెల్పర్ , చికెన్ స్టివార్డ్ ( హోటల్ మేనేజ్ మెంట్ ) కోర్సుకు 100 రోజుల కాలపరిమితి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు విశాఖపట్నంలో శిక్షణను ఇవ్వనున్నామని, శిక్షణ కాలంలో ఉచిత వసతి మరియు యూనిఫారమ్, టీచింగ్ మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ బయోడేటాతో పాటు సర్టిఫికేట్లు , ఆధార్ కార్డు, 4 పాస్ పోర్ట్ సైజు గల ఫొటోలతో హాజరుకావాలని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సోమవారం జాబ్ మేళా : ఉపాది అధికారి అరుణ