ఆసియా మాష్టర్ అధ్లెటిక్స్ లో డా. వాసుదేవాచారికి 4వ స్థానం

శ్రీకాకుళం : డిశంబరు 16 : ఈ నెల 2 నుండి 7వ తేదీ వరకు మలేషియా దేశం కుచింగ్ నగరంలో జరిగిన 21వ ఆసియా మాష్టర్ అధ్లెటిక్స్ పోటీలో భారతదేశం తరపున 50 సంవత్సరముల విభాగములో పోల్ వాల్టు క్రీడాంశము నందు 4వ స్థానం గెలుపొంది, భారత దేశం కీర్తిని త్రివర్ణపతాకం ఎగురవేసిన శ్రీకాకుళం నకు చెందిన డా. మంతిన వాసుదేవాచారిని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సోమవారం అభినందించారు. ఈయన 2020 ఫిబ్రవరిలో జరగనున్న ప్రపంచ మాష్టర్ అధ్లేటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో పోల్ వాల్టు నందు బంగారు పతకం సాధించారు.   జాతీయ స్థాయిలో గోవాలో జరిగిన మాష్టర్ అధ్లెటిక్స్ నందు పోల్ వాల్టులో ద్వితీయ స్థానం పొంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైయ్యారు. భారతదేశం తరపున ఆసియా మాష్టర్ అధ్లెటిక్స్ పోటీలో 4వ స్థానం గెలుపొంది నందుకు డా. వాసుదేవాచారిని జిల్లా అధికార యంత్రాంగం అభినందించి. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి, బి. శ్రీనివాస్ కుమార్, ఎలక్ట్రానిక్ మిడియా ప్రతినిధి శాసపు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.