త్వరలో విశాఖకు ప్రైవేటురైల్లు

న్యూఢిల్లీ : జనవరిలో (15 రోజుల్లో) కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏంటంటే ?100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లకు అనుమతులు ఇస్తున్నామనీ బిడ్లు వేసుకునేవారు వేసుకోవచ్చని. డిసెంబర్ 19న కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రకారం 100 రూట్లను ఎంపిక చేశారు. అందువల్ల ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలోనే నడిచిన భారతీయ రైళ్లు. ఇకపై ప్రైవేట్ రంగంలోనూ పరుగులు పెట్టబోతున్నాయన్నమాట. ఇంతకీ ఏ రూట్లలో ప్రైవేట్ రైళ్లు వెళ్తాయంటే? ఎక్కువ జర్నీ ఉన్న రూట్లను ఎంపిక చేశారు. అవి ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం, చెన్నై-సికింద్రాబాద్, ముంబై-కోల్‌తా, ముంబై-చెన్నై, ముంబై-గౌహతి, న్యూఢిల్లీ-ముంబై, తిరువనంతపురం-గౌహతి, న్యూఢిల్లీ-కోల్‌కతా, న్యూఢిల్లీ-బెంగళూరు, న్యూఢిల్లీ-చెన్నై, కోల్‌కతా చెన్నై, చెన్నై-జోధ్‌పూర్, ముంబై-వారణాసి, ముంబై-పుణె, ముంబై-లక్నో, ముంబై-నాగపూర్, నాగపూర్-పుణె, పాట్నా-బెంగళూరు, చెన్నై-కోయంబత్తూర్, సూరత్-వారణాసి, భువనేశ్వర్-కోల్‌కతా.కొన్ని రూట్లను  న్యూఢిల్లీ నుంచీ పాట్నా, అలహాబాద్, అమృత్‌సర్, చంఢీగఢ్, కత్రా, గోరఖ్‌పూర్, ఛాప్రా, భగల్పూర్‌లో కూడా సెలెక్ట్ చేశారు.ఈ 100 రూట్లూ కమర్షియల్‌గా ఎంతో బిజీ రూట్లు. వీటిలో 35 ఢిల్లీకి కనెక్ట్ అయి ఉన్నాయి. 26 ముంబైకీ, 12 కోల్‌కతాకీ, 11 చెన్నైకీ, 8 బెంగళూరుకీ కనెక్ట్ అవుతున్నాయి. మెట్రో నగరాలతో కనెక్ట్ కాని కొన్ని రూట్లను కూడా పరిశీలిస్తున్నారు అవి, విశాఖపట్నం-తిరుపతి, నాగపూర్-పుణె, గోరఖ్‌పూర్-లక్నో, కోటా-జైపూర్, చంఢీగఢ్-లక్నో.దీర్ఘకాలిక  ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రైల్వే శాఖ ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలిసింది. ప్రభుత్వ రంగ రైళ్ల మాగ్జిమం స్పీడ్ ప్రస్తుతం గంటకు 160 కిలోమీటర్లు.  ప్రైవేట్ ఆపరేటర్లు ఎంటరైతే వాళ్లు నెమ్మదిగా వెళ్లాలని అనుకోరు. కాబట్టి. అత్యాధునిక టెక్నాలజీతో దూసుకెళ్లే రైళ్లను ప్రవేశపెడతారు. ఫలితంగా వేగం పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా టికెట్ రేట్లు డిసైడ్ చేసుకోనిస్తామని కేంద్ర రైల్వే శాఖ పరోక్షంగా తెలిపింది.