శ్రీకాకుళం : డిసెంబర్ 2 : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను మంగళవారం ఉదయం 10.30గం.లకు స్థానిక బాపూజీ కళామందిర్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రహదారులు,భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్, సభాధ్యక్షులుగా ధర్మాన ప్రసాదరావుతో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు, సుమారు 200 మంది విభిన్న ప్రతిభావంతులు హాజరుకానున్నారని తెలిపారు.ఇందులో విభిన్న ప్రతిభావంతులకు సత్కార కార్యక్రమాలు ఉంటాయని, అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఇటీవల నిర్వహించిన విభిన్నప్రతిభావంతుల జిల్లాస్థాయి ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానంతో పాటు ప్రశంసాపత్రాలను గౌరవ అతిథులచే పంపిణీచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
రేపు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం