పొలంబడుల నిర్వహణకు కొటేషన్లు ఆహ్వానం : సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసలు

శ్రీకాకుళం : డిశంబరు 31 : వ్యవసాయ  శాఖ  ద్వారా రబీ 2019-20 సంవత్సరంలో అమలు  జరుగుతున్న పొలంబడుల నిర్వహణకు కొటేషన్లను ఆహ్వానిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ కె.శ్రీనివాసులు  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారుజిల్లాలో 445 డా.వై.ఎస్.ఆర్పొలంబడుల నిర్వహణ నిమిత్తం 2225 .పి.ఎంకిట్లు, 2225 స్వీప్ నెట్ లు, సరఫరాచేయు నిమిత్తం తయారీదారులు మరియు సరఫరాదారుల సంస్థల నుండి కోటేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారుఒక్కొక్క .పి.ఎంకిట్ క్రింద రూ.150, స్వీప్ నెట్ క్రింద రూ.80 లకు లోబడి సరఫరా చేయుటకు కొటేషన్లను ఆహ్వానిస్తున్నామని,  2020 జనవరి  తేదీ నుండి 7 తేదీ లోగా కొటేషన్లను వేయాలని చెప్పారు.  పూర్తి వివరాలకు  వ్యవసాయ శాఖ సంయుక్త సంచాకులు శ్రీకాకుళం వారిని   88866 12702 మరియు 88866 13768  ఫోన్ నెంబర్లను  సంప్రదించ వచ్చునని తెలిపారు.