శ్రీకాకుళం : డిసెంబర్ 2 : జోనల్ వ్యవస్థలో అస్తవ్యస్థ నిర్ణయాలతో గత ప్రభుత్వంలో పదోన్నతులలో అన్యాయం జరిగిన ఇంజనీర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఇంజనీర్ల అస్సోసియేషన్ అధ్యక్షులు డోల తిరుమల రావు ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లు రాష్ట్ర మంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ ను ఆదివారం ఉదయం కలసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల హైకోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలన్న వారి విజ్ఞప్తిపై శ్రీకాకుళంలో మంత్రి కృష్ణదాస్ స్పందిస్తూ సమస్యను జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి సమస్యను వివరిస్తానని హామీనిచ్చారు. జలవనరుల వినియోగంలో ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్రకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా పదోన్నతుల సమస్యను వెంటనే పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.కృష్ణదాస్ ను కలసిన వారిలో ఉత్తరాంధ్ర ఇంజనీర్లలో ఎస్ఈలు, ఈఈ లు ఎస్.వి.రమణ, డి.శ్రీనివాసులు, ఎం.వి.రమణ, హెచ్.మన్మధరావు, జి. రామచంద్ర, ఎ.ఢిల్లేశ్వరరావు, బి. శ్రీహరి, డీఈఈలు మురళి మోహన్, గంగరాజు, ఎస్.ఎస్.అప్పారావు, రవీంద్ర నాయుడు, నాగేశ్వరరావు, ఎఈఈలు బగ్గు సత్యనారాయణ, ముద్దాడ సత్య నారాయణ, కింజరాపు దాలయ్య, శివాజీ,సురేష్, తాడి.శ్రీనివాస్, రవి కుమార్ తదితరులున్నారు.
పదోన్నతుల్లో న్యాయం చేయండి : ఉత్తరాంధ్ర ఇంజనీర్ల సంఘం