సచివాలయ పశువైద్య సహాయకులకు శిక్షణ ప్రారంభం

శ్రీకాకుళం : ప్రతి రైతుకు ఇంటిముంగిటే సేవలు అందించే లక్ష్యంతో గ్రామ సచివాలయలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఆశయాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని జిల్లా సంయుక్త సంచాలకులు డా.ఆరికి ఈశ్వరరావు అన్నారు. నూతనంగా నియమితమైన గ్రామ సచివాలయ పశు సంవర్ధక సహాయకులకు 6 రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు. ఉప సంచాలకులు డా.జగన్నాధం మాట్లాడుతూ రైతులకు అధికారులకు అనుసందానం లో కీలకమైన పాత్ర పోషించాలని ,రాజన్న పశువైద్యాన్ని రైతులు అందించాలన్నారు. పాడి గ్రామీణాభివృద్ధి లో జీవనాడిగా,రైతులకు మంచి ఆర్థికాభివృద్ధిని సాధించడంలో అందరూ పట్టుదలతో పనిచేయాలని,ప్రభుత్వ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జిల్లా శిక్షణా కేంద్రం ఉప సంచాలకులు డా.మాదిన ప్రసాదరావు అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిక్షకులు మట్లడుతూ ఈ వారం రోజుల్లో గ్రామ సచివాలయంలో నిర్వహించవలసిన విధులు, భాద్యతలు, పశు వైద్య చికిత్స విధానం, వ్యాధుల నివారణ వంటి విషయాలు నేర్చుకొని గ్రామ స్థాయిలో అవలంబించి మంచి ఫలితాలు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా.మోహిణికుమారి,పశువైదులు డా.శ్రీనివాస్, కిశోర్, డా.స్వాతి,కరుణ,సిబ్బంది పాల్గొన్నారు.