నెంబర్ స్టేట్ మెంట్ నిక్కచ్చిగా తయారు చేయాలి

శ్రీకాకుళం : డిశంబరు 17 : నెంబర్ స్టేట్ మెంట్ ను నిక్కచ్చిగా తయారు చేయాలని జిల్లా ఖజానాధికారి జి.నిర్మలమ్మ పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో  2020-2021 సంవత్సరపు బడ్జెట్ తయారీ కోసం నంబర్ స్టేట్ మెంట్ పై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు  జిల్లా ఖజానాధికారి జి.నిర్మలమ్మ ముఖ్యఅతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డి.డి.ఓ.లు నంబర్ స్టేట్ మెంట్ ను పక్కాగా రూపొందించి జిల్లా ఖజానా కార్యాలయానికి అందచేయాలన్నారు.నంబర్ స్టేట్ మెంట్ ను   కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కేడర్ స్ట్రెంత్ ను అనుసరించి తయారు చేయాలని తెలిపారు. ప్రతీ ఒక్కరి జీత భత్యాల నిక్కచ్చి వివరాలతో తయారు చేయాలన్నారు.డిడిఓలు రూపొందించి యిచ్చిన నెంబర్ స్టేట్ మెంట్ ననుసరించి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి నిధులు విడుదల కాబడతాయన్నారు.  2019 సంవత్సరం డిశంబరు నాటికి అనగా నవంబరు 2019 సంవత్సరపు ఉద్యోగుల జీతభత్యాల ననుసరిచి నెంబర్ స్టేట్ మెంట్ తయారు చేయాలన్నారు. కావున నెంబర్ స్టేట్ మెంట్ ను నిక్కచ్చిగా తయారు చేయాలన్నారు.అనంతరం ఆన్ లైన్ ద్వారా వివిధ పద్దుల క్రింద హౌస్ రెంట్, వాహనాల బిల్లులు,ఎలక్ట్రిసిటీ,వాటర్ ఛార్జెస్ బిల్లుల తయారీపై పవర్ పాయంట్ ప్రెజెంటేషన్ ద్వారా   అవగాహన కలిగించారు. సర్వీస్ పెన్షన్, అవివాహిత కుమార్తెకు, వితంతు కుమార్తెకు మంజూరు చేసే పింఛనుపై వివరించారు.మానసిక,శారీరిక వికలాంగులైన పిల్లలకు వారి జీవితాంతం పింఛను వస్తుందని తెలిపారు.  వారసులు సంవత్సరంలోపు పింఛను దరఖాస్తు చేసుకోవాలన్నారు.పింఛనుల మంజూరీపై డిడిఓలు అత్యంత శ్రధ్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎస్.టి.ఓ.లు తులసీరావు,భాగ్యలక్ష్మి, ఎ.టి.ఓ.లు తవిటన్న, వివిధ శాఖాధికారులు, సబ్ ట్రెజరీ అధికారులు, ఎస్.టి.ఓ.లు తదితరులు హాజరైనారు.