శ్రీకాకుళం : డిసెంబర్ 9 : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 16 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ. కళ్యాణ్ చక్రవర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలుమూరు నుండి ఎన్. పార్వతీశ్వరరావు ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు పట్టాదారు పాసుపుస్తకం , టైటిల్ డీడ్ ను మంజూరు చేయాలని కోరారు.కోటబొమ్మాలి మండలం కురుడు నుండి సిహెచ్.సింహాద్రి ఫోన్ చేస్తూ కుటుంబంలో మరణించిన సభ్యులకు రావాల్సిన భీమా డబ్బులు ఇంతవరకు మంజూరుకాలేదని ఫిర్యాదు చేశారు. హిరమండలం నుండి ఏ.సురేష్ మాట్లాడుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈకేవైసి పనిచేయడం లేదని, అందువలన తనకు గృహం మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. సారవకోట మండలం బురిడివలస నుండి యం.దాలప్పన్న మాట్లాడుతూ తన ఇంటి విద్యుత్ మీటర్ కాలిపోయినందున దాన్ని తొలగించి కొత్త మీటర్ వేయాలని కోరారు. బూర్జ మండలం పెద్దపేట నుండి ఏ.రామకృష్ణంనాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలోని బి.టి రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కావున కొత్త రోడ్డును వేయాలని కోరారు. పొందూరు మండలం రాపాక నుండి కె.సూరీడు మాట్లాడుతూ సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు.కానీ దానికి నీటి సరఫరా ఇప్పించాలని కోరారు. వంగర మండలం సంగం నుండి కె.సూరీడమ్మ మాట్లాడుతూ తనకు పొలం ఉందని, కావున రైతు భరోసాను మంజూరుచేయాలని కోరారు. హిరమండలం నుండి కె.సంజీవరావు మాట్లాడుతూ తనకు చెందిన సర్వే నెం.71ను 22ఎ నుండి తొలగించాలని కోరారు.గార మండలం కొడలి నుండి జి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ రిజర్వాయర్ వద్ద నుండి రద్దును తొలగించాలని కోరారు. శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీ నుండి ఎన్.సత్యవతి మాట్లాడుతూ రామిగెడ్డ ఆక్రమణ జరిగిందని, దానిని తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస మండలం దూసి నుండి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామానికి మురుగునీటి కాలువలను ఏర్పాటుచేయాలని కోరారు. పాలకొండ మండలం వెలగవాడ నుండి కె.శంకరరావు మాట్లాడుతూ తన ఆధార్ కార్డు నంబర్ తో వేరొక పేరు నమోదు అయిందని, దాన్ని తొలగించాలని కోరారు. మందస మండలం హరిపురం నుండి జి.మురళీకృష్ణ మాట్లాడుతూ రోడ్డుపై ఉన్న ఇసుకను తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డా.వి.వి.కృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, జిల్లా విద్యా శాఖాధికారి చంద్రకళ, ఆర్.టి.సి పి.ఆర్.ఓ బి.ఎల్.పి.రావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలక్టర్ కు వినతుల వెల్లువ