ధాన్యం కొనుగోలులో రైతుల ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : డిశంబరు 30 : ధాన్యం కొనుగోళులో రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా ప్రతినిధులతో ధాన్యం కొనుగోళుపై మాట్లాడారు. రైతులకు అనువైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగాను, రైతు సంక్షేమమే ధ్యేయంగాను ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళు ఇంకా ముమ్మరంగా చేయుటకు రైతుల ప్రయోజనాలో ముఖ్యంగా విధానాలు సరళీకరణ చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. రైతులకు, మిల్లర్లకు సమన్వయం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.