శ్రీకాకుళం : డిశంబరు 4 : ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ తో వెయ్యి కోట్ల మేర పనులు చేపట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టి సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఉపాధి హామీ సంచాలకులు పి.చిన తాతయ్యలుతో కలసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ క్రింద అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖ తక్షణం పనులు ప్రారంభించాలని అన్నారు. నిర్ధేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయుటకు సంబంధిత శాఖల అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించుటకోవాలని ఆదేశించారు. అంచనాలు తయారు చేసి మంజూరుకు దస్త్రాలు సమర్పించాలని అన్నారు.అన్ని పాఠశాలల్లో ప్రహారీ గోడలు నిర్మించవచ్చని చెప్పారు. హౌసింగ్ లో మరగుదొడ్ల నిర్మాణం, మినీ గోకులాల నిర్మాణం పనులను గుర్తించాలని అన్నారు. రూ.830 కోట్ల వరకు మెటీరియల్ కంపోనెంట్ జనరేట్ చేయడం జరిగిందని, ఇదివెయ్యి కోట్ల రూపాయల విలువ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కావున ఆ మేరకు పనులు చేపట్ట వచ్చన్నారు. గ్రామాల్లో కాలువల పనులను రూ.350 కోట్ల వరకు చేపట్టవచ్చునని,రూ.120 కోట్లకు ఇప్పటికే మంజు చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది అత్యధికంగా మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. వేతన చెల్లింపుకు ఉపాధీ హామీ కూలీలకు హామీ ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ పనులు ప్రారంభానికి గ్రౌండింగ్ మేళాను ఈ నెల నిర్వహించాలని సూచించారు.
ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ తో వెయ్యి కోట్ల పనులు