రేపు ఢిల్లీ వెళ్ళనున్న ముఖ్యమంత్రి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటలకు సీఎం నివాసం నుంచి బయలుదేరి 4 గంటల 20నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్‌ పోర్ట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ​ద్వారా సాయంత్రం 7 గంటలకు జన్‌పథ్‌‌-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు.