శ్రీకాకుళం : డిశంబరు 9: సమీకృత గిరిజనాభివృద్ద్ధి సంస్థ సీతంపేటప్రాజెక్ట్ అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ ప్రోగ్రాము లో భాగంగా ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావన్ ఉపగ్రహ కేంద్రాన్ని సీతంపేట గిరిబాలలు సందర్శించనున్నారు. సోమవారం స్థానిక వై టి సి నుండి నలభై మంది విద్యార్థుల తో కూడిన ప్రత్యేక బస్సు బయలు దేరింది. డిప్యూటీ డి.ఈ.వో. గున్ను రామమోహన్రావు లాంఛనంగా జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో సందర్శన ఎంతో స్ఫూర్తినిస్తుందని, విజ్ఞాన సముపార్జనకు ఎంతో దోహద పడుతుందన్నారు. అంతరిక్ష పరిశోధన లో భారతదేశం సాధిస్తున్న ప్రగతి పి.యస్.యల్.వి సి 48 రీసోర్ట్2 బంగారం ఆర్ ఒన్ లాంచింగ్ ప్రత్యక్షంగా తిలకించడానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ నుండి విద్యార్థులకు అనుమతి లభించిందని ఈ నెల 11 మరియు 12వ తేదిలలో వీక్షించనున్నారని అన్నారు. ఇస్రో పర్యటనకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సహాయ సహకారాలు అందివ్వనున్నారని తెలిపారు. ఈ బస్సు యాత్రలో 20 మంది బాలురు, 20మంది బాలికలు మరియు విధ్యార్ధులకు సహాయంగా ఉపాధ్యాయులు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో సూపర్ 60 ప్రిన్సిపాల్ మురళీబాబు, జి. సి. డి. వో. సి.హెచ్ జ్యోతి, వార్డెన్ వాసుదేవరావు, బి కిరణ్ పాల్గొన్నారు.
ఇస్రో ను సందర్శించనున్న సీతంపేట గిరిబాలలు