శ్రీకాకుళం : డిశంబరు 19 : యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 50 మంది యువతులు జిల్లా పర్యటనకు విచ్చేసారు.ఈ సంధర్బంగా వారు జాయింటు కలెక్టరు డా. కె.శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సంధర్బంగా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ఈ పర్యటన కార్యక్రమాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ ప్రాంత జీవన వైవిద్యాన్ని తెలుసుకోవాలని జాయింటు కలెక్టరు యువతకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వంశధార ప్రోజెక్టు, పొందూరు ఖద్దరు పరిశ్రమ, ప్రముఖ పర్యటక కేంద్రాలకు వారిని తీసుకు వెళ్లనున్నట్లు సెట్ శ్రీ ముఖ్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అక్కౌంటింగు అధికారి కె.వి.రమణ, టూరిజం ఆఫీసరు నాగార్జునరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో తూగో యువతులు