శ్రీకాకుళం : డిశంబర్ 11: జిల్లాలోని విభిన్నప్రతిబావంతుల బ్యాక్ లాగ్ పోస్టుల జాబితాను సిద్దం చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కె.జీవన్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేసారు. జిల్లాలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల పోస్టులను భర్తీ చేయుటకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమేనని అన్నారు. నోటిఫికేషన్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి మెరిట్ లిస్టు తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ లో భాగంగా నాలగవ తరగతి పోస్టులైన ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్,చౌకిదార్, వాచ్ మేన్, కుక్, కమాటి, స్వీపర్ పోస్టులకు సంబంధించి జాబితా సిద్థం చేసి వాటిని srikakulam.ap.gov.in వెబ్ సైట్ లో పెట్టడం జరిగిందన్నారు. ఈ జాబితాను పరిశీలించుకోవాలని ఆయన కోరారు. జాబితాపై ఎవరికైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 వతేదీలోగా సహాయ సంచాలకులు విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం వారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా పిర్యాధు చేయవచ్చని స్పష్టం చేసారు. 20వ తేదీ తరువాత వచ్చే పిర్యాధులను స్వీకరించడం జరగదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టుల జాబిత సిద్థం