శ్రీకాకుళం : డిశంబరు 7 : జిల్లాలో పర్యాటకరంగం అభివృద్దికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం జిల్లా పర్యాటక ప్రదేశాలకు, ప్రకృతి అందాలకు నిలయం అన్నారు. ఎన్నో చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలలో పర్యాటకరంగ అభివృద్దికి పర్యాటక శాఖ చర్యలు చేపడుతుందని చెప్పారు. పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలు కల్పిస్తుందన్నారు. చారిత్రక, పర్యాటక ప్రదేశాలలో రిసార్ట్స్, హోటళ్లు, ఇతర పర్యాటక సంబంధిత ప్రోజెక్టులు చేపట్టే పారిశ్రామికవేత్తలకు రాయితీలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. స్వంత స్థలం కలిగి ప్రోజెక్టులు చేపట్టేవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.పెట్టుబడుదారులను ఆకట్టుకొనేందుకు, వారిని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో త్వరలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన మదుపరులు తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని లేదా ఫోన్ నంబరు 6309942033 లో సంప్రదించాలని పేర్కొన్నారు..
పర్యాటకరంగంలో పెట్టుబడులకు మదుపరులు ముందుకు రావాలి