శ్రీకాకుళం, డిశంబరు 15: శ్రీకాకుళం పట్టణం, జిల్లాను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్చభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. ఆదివారు 80 అడుగుల రోడ్డులో గల ఆటస్థలం పరిసరాలలోరెడ్ క్రాస్ సంస్థ నిర్వహించిన స్వచ్చభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విధ్యార్థులతో పాటుగా చెత్తను ఏరి పరిసరాలను శుభ్రంచేసారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణాన్ని స్వచ్చనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్చభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని, ప్రజలు,యువత ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకాకుళం పట్టణంను స్వచ్చనగరంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థచైర్మన్ పి.జగన్మోహనరావు, విశ్రాంత ఉద్యోగులు, డిగ్రీ,జూనియర్ మహిళా కళాశాల విద్యార్థినులు, హైస్కూలు విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంను స్వచ్చ నగరంగా తీర్చిదిద్దాలి